- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kurnool: ఆధిపత్య పోరు.. ఎవరూ తగ్గట్లేదుగా..!
దిశ, కర్నూలు ప్రతినిధి: పార్టీ ఆవిర్భావం నుంచి దాదాపు 30 ఏళ్ల పాటు నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన తెలుగుదేశం పార్టీ నేడు అధిష్టానం అనాలోచిత నిర్ణయాలతో గెలుపు పిలుపునకు దూరమైంది. పార్టీలో రెండు వర్గాలుగా చీలడంతో పార్టీ తీరని నష్టాన్ని చవి చూస్తోంది. మొదటి నుంచి పార్టీ కోసం పని చేసిన కుటుంబాన్ని కాదని అప్పటికప్పుడు పార్టీలో చేరిన వారికి టికెట్ ఇవ్వడంతో మరో వర్గం నేతలకు మింగుడు పడడంలేదు. కనీసం ఈ సారైనా తమను గుర్తించి సీటిస్తే గెలుపును చంద్రబాబుకు గిఫ్టుగా ఇస్తామని మరో వర్గం నాయకులు అంటున్నారు. అంతిమంగా టీడీపీలో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, నియోజకవర్గ నాయకులు వైకుంఠం మల్లికార్జున చౌదరిల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరిందనడంలో సందేహం లేదు. వీటిని చక్కబెట్టి పార్టీ గెలుపునకు కృషి చేస్తారా ? లేక ఎప్పటిలాగే నిర్ణయించి అధికార పార్టీ చేతిలో చిత్తుగా ఓడిపోతారా ? అన్నది ప్రశ్నగా మారింది. అధికార వైసీపీలో కూడా అదే పరిస్థితి నెలకొంది.
కర్నూలు జిల్లాలో ఆలూరు నియోజకవర్గంలో అటు అధికార వైసీపీ, ఇటు టీడీపీలో వర్గ పోరు నడుస్తోంది. ప్రధానంగా 30 ఏళ్లుగా ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉండేది. అలాంటిది వైసీపీకి సానుభూతి కలిసొచ్చింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పై ఉన్న అభిమానంతో ఆయన తనయుడికి ఒక ఛాన్స్ ఇద్దామని ఓటర్లు నిర్ణయించుకుని గెలుపును అందించారు. ఎక్కడ లోపం జరిగిందని ఆలోచించాల్సిన టీడీపీ ఎన్నికల సమయంలో పార్టీ మారిన వారికి టికెట్ ఇచ్చి ఓటమిపాలైంది. టీడీపీలో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, నియోజకవర్గ నాయకులు వైకుంఠం మల్లికార్జున చౌదరిల మధ్య వర్గ పోరు తారాస్థాయికి చేరింది. ఎవరికి వారు కార్యక్రమాలు చేస్తుండడం కార్యకర్తలకు వీరి తీరు తలనొప్పిగా మారింది. నాయకుల మధ్య విభేదాల కారణంగా ప్రతిసారి ఏదో రూపంలో ఆలూరు టికెట్ కష్టపడ్డ వారికి కాకుండా ఇతరులకివ్వడం, అభ్యర్థులు పరాజయం చెందడం పరాపాటిగా మారింది. నేతల మధ్య ఉన్న విభేదాలు కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అందరూ కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థులను గెలిపించాలని పదేపదే చెబుతున్నా స్థానిక నేతల చెవులకు ఎక్కడంలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి 2024లో టీడీపీ తరఫున టికెట్ ప్రస్తుత ఇంచార్జి కోట్ల సుజాతమ్మకా? లేక నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉన్న వైకుంఠం మల్లికార్జునకా ? అనే చర్చ సాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ కలిసికట్టుగా పని చేస్తేనే ఆలూరు నుంచి పోటీ చేసే టీడీపీ అభ్యర్థి గెలుపు చాలా సులభతరమౌతుందని రాజకీయ విశ్లేషకులు, సీనియర్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
30 ఏళ్లు తిరుగులేని శక్తిగా టీడీపీ
పార్టీ ఆవిర్భావం నుంచి ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత, దివంగత కర్నూలు కేడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ వైకుంఠం శ్రీరాములు సారథ్యంలో దాదాపు 30 ఏళ్లగా టీడీపీ తిరుగులేని శక్తిగా వెలుగోందింది. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక శాతం టీడీపీ అభ్యర్థులను ఏకగ్రీవంగా చేసిన ఘనత వైకుంఠం శ్రీరాములకే దక్కింది. వైకుంఠం శ్రీరాములు పార్టీకి అందించిన సేవలను గుర్తించి అప్పట్లో జిల్లా కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నామినేటెడ్ పోస్ట్ కేటాయించారు. అయితే ఆయన ఎదుగుదల చూసి ఓర్వలేని కొంతమంది రాజకీయ ప్రత్యర్థులు వేసిన ఎత్తగడలో 2006 నవంబర్ 18న చిప్పగిరిలో తమ నివాసంలో దంపతులిద్దరూ దారుణ హత్యకు గురయ్యారు. వైకుంఠం శ్రీరాములు హత్యోదనంతరం ఆయన కుమారులు వైకుంఠం మల్లికార్జున చౌదరి, వైకుంఠం శివప్రసాద్ లు పార్టీ పగ్గాలు చేపట్టారు. అయితే పార్టీ కోసం తమ తల్లిదండ్రులను కోల్పోయి పార్టీ పటిష్టత కోసం విశేష సేవలందించినా అధిష్టానం వీరికి కాకుండా 2004 లో టికెట్ మసాల పద్మజకు ఇచ్చారు. అలాగే 2009 లో పొత్తులలో భాగంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు, 2014 ఎన్నికల్లో మాజీ టీడీపీ ఇంచార్జి వీరభద్ర గౌడ్ కు ఇచ్చారు. అయితే 2019 లోనైనా తమకు సీటు ఇస్తారనే ఆశ ఉండేది. ఎన్నికల చివరి నిమిషంలో పార్టీలో చేరిన కోట్ల సుజాతమ్మకు సీటు ఇచ్చి మరోమారు మొండిచేయి చూపారు. నియోజకవర్గంలో అన్ని మండలాల్లోనే వైకుంఠం శ్రీరాములు కుటుంబానికి ఓ బలమైన వర్గం, క్యాడర్ ఉన్నప్పటికీ వారికి టికెట్ విషయంలో అధిష్టానం వారికి సీటు ఇవ్వకపోవడంతో చాలా నిరాశకు లోనయ్యారు.
అయినా మొదటి నుంచీ పార్టీ కోసం పని చేసిన వీరి కుటుంబం వైకుంఠం అంటేనే టీడీపీ అనే బ్రాండ్ ఉంది. అందు వల్ల వీరు ఏనాడు కూడా వేరే పార్టీలో చేరాలనే ఆలోచన చేయకుండా పార్టీ అభివృద్ధి కోసం పని చేసుకుంటూ కార్యకర్తలకు అండగా ఉంటూ వస్తున్నారు. రానున్న 2024 లో జరిగే ఎన్నికల్లో నైనా తమ కుటుంబానికి సీటు కేటాయిస్తే గెలిచి తీరుతామని వైకుంఠం మల్లికార్జున చౌదరి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుత టీడీపీ ఇంచార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఇతర నేతలను, కార్యకర్తలను కలుపుకొనిపోకుండా ఒంటెద్దు పోకడ రాజకీయాలు చేస్తున్నారని సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు బహిరంగ విమర్శలు చేయడ గమనార్హం. అంతిమంగా అధిష్టానం టీడీపీ సీటు కోట్ల సుజాతమ్మకిస్తారా ? లేక చాలా సార్లు ఆశించి భంగపాటుకు గురౌతోన్న వైకుంఠం మల్లికార్జున చౌదరి కుటుంబానికిస్తారా అనేది సందేహంగా మారింది.
అధికార వైసీపీలోనూ అదేతీరు
అధికార వైసీపీలో ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మనూరు జయరాం మంత్రిగా కొనసాగుతున్నారు. ఈయన అనుచరులు సొంత పార్టీలో వర్గ విభేదాలు సృష్టించారు. మంత్రి భిక్షం వేయడంతోనే జెడ్పీటీసీ పదవి వచ్చిందని చిప్పగిరి జెడ్పీటీసీ విరుపాక్షి పట్ల వ్యాఖ్యలు చేశారు. దీంతో పార్టీ కోసం పని చేస్తున్న జెడ్పీటీసీ తాను వైఎస్ఆర్ అభిమానినని, వైసీపీ అధినేత జగన్ కోసం పని చేస్తా తప్ప మంత్రి భిక్ష తనకు వద్దంటూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అధిష్టానం కలుగజేసుకుని నచ్చజెప్పింది. అప్పటి నుంచి నేటి వరకు కూడా వైసీపీలో ఎవరికి వారుగా కార్యక్రమాలు చేసుకుంటూపోతున్నారు. అయితే మంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడి కారణంగా మంత్రి పట్ల నియోజకర్గంలో చాలా వ్యతిరేకత నెలకొంది. ఈ విషయం అధిష్టానం దృష్టికి వెళ్లింది. దీంతో అధిష్టానం మంత్రికి రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చి ఆయన తమ్ముడికి టికెట్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో తనకూ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని చిప్పగిరి జెడ్పీటీసీ విరుపాక్షి అధిష్టానానికి విన్నవించినట్లు సమాచారం.
Read more: