- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సినీ ఫక్కీలో నగల వ్యాపారి కిడ్నాప్.. స్కెచ్ మామూలుగా లేదుగా..!
దిశ, వెబ్ డెస్క్: కారులు వచ్చారు.. షాపులు చూపించాలని అడిగారు. షాపులు చూపిస్తుండగా యజమానిని కారులోకి లాగి పడేసి ఎత్తుకెళ్లారు. సినీ ఫక్కీలో జరిగిన కిడ్నాప్ ఘటన కర్నూలు జిల్లా గూడూరులో జరిగింది. గ్రామానికి చెందిన వెంకటేశ్ బంగారు నగల వ్యాపారం చేస్తున్నారు. ఎమ్మిగనూరు రోడ్డులో ఆయనకు ఖాళీ షాపులు ఉన్నాయి. అద్దెకు కావాలంటూ కొందరు వ్యక్తులు వెంకటేశ్ వద్దకు వచ్చారు. షాపులు చూపించమని అడిగారు. అయితే దుండగుల ప్లాన్‌ను పసిగట్టలేని వ్యాపారి వెంకటేశ్ షాపులు చూపిస్తున్నారు. ఇంతలో దుండగులు ఒక్కసారిగా వెంకటేశ్‌ను కారులో తీసుకెళ్లారు.
దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు స్థానిక సీసీ ఫుటేజులను పరిశీలించారు. వీటి ఆధారంగా కారును వెళ్లిన రూట్‌ను గుర్తించారు. టీములుగా ఏర్పడి గాలిస్తున్నారు. త్వరలో కేసును ఛేదిస్తామని తెలిపారు. అయితే ‘వ్యాపారి వెంకటేశ్‌ను దుండగులు ఎందుకు కిడ్నాప్ చేశారు.. వ్యాపారి లావాదేవీలేమైనా ఉన్నాయా..?.. లేదా ఏదైనా వివాదాలు ఉన్నాయా..?’ అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.