Nandyala: కర్ణాటకలో ఘోరం... ఏపీకి చెందిన ఐదుగురు దుర్మరణం

by srinivas |   ( Updated:2023-06-06 11:43:36.0  )
Nandyala: కర్ణాటకలో ఘోరం... ఏపీకి చెందిన ఐదుగురు దుర్మరణం
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్నాటకలోని కలబురిగిలో దర్గా ఉరుసు జాతరకు వెళ్లి తిరిగొస్తూ ఏపీ వాసులు ఐదుగురు దుర్మరణం చెందారు. నంద్యాల జిల్లా వెలగోడు మండలానికి చెందిన మునీర్‌ (40), నయామత్‌ (40), రమీజా బేగం (50), ముద్దత్‌ షీర్‌ (12), సుమ్మి (13) కలబురిగిలో దర్గా ఉరుసు జాతరకు బయలు దేరారు. అయితే యాదగిరి జిల్లాలో రోడ్డుపై ఆగి ఉన్న లారీని వీరి జీపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో 13 మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అలాగే నంద్యాల జిల్లాలోని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

Next Story

Most Viewed