- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
CPI: ఒడిశా రైలు ప్రమాద మృతులకు శ్రద్ధాంజలి
by srinivas |

X
దిశ, దేవనకొండ: ఒడిశా రైలు ప్రమాదంపై కేంద్రమే పూర్తి బాధ్యత వహిస్తూ సమగ్ర విచారణ చేపట్టి బాధితులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ దేవనకొండ మండల కార్యదర్శి ఎమ్.నరసరావు డిమాండ్ చేశారు. అలాగే మృతుల కుటుంబాలను ఆదుకోవాలని, గాయపడిన కుటుంబాలను భరోసా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వమే అండగా ఉండాలన్నారు. దేవనకొండ సిపిఐ కార్యాలయం నందు రైల్వే ప్రమాద ఘటనలో మృతి చెందిన వారికి సానుభూతి వ్యక్తం చేస్తూ కొవ్వొత్తులతో శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా ఎమ్.నరసరావు మాట్లాడుతూ ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటనలో 300 మంది దాకా మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరారు. మృతుల కుటుంబాలకు 50 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.
Next Story