మహాకుంభాభిషేక మహోత్సవానికి ముఖ్యమంత్రికి ఆహ్వానం

by Javid Pasha |   ( Updated:2023-05-09 14:15:55.0  )
మహాకుంభాభిషేక మహోత్సవానికి ముఖ్యమంత్రికి ఆహ్వానం
X

దిశ, శ్రీశైలం : ఈ నెల 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరిగే మహాకుంభాభిషేక మహోత్సవ కార్యక్రమానికి రావాలని రాష్ర్ట ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, దేవదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ, దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న, అర్చక ట్రైనింగ్ అకాడమీ డైరెక్టర్ డా. వేదాంతం రాజగోపాల చక్రవర్తి తదితరులు ముఖ్యమంత్రి జగన్ ను ఆహ్వానించారు. ఈ మేరకు మంగళవారం వెలగపూడిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసి ఆహ్వానించారు. అనంతరం సీఎంను వేద ఆశీర్వచనంతో శేషవస్త్రాలు సమర్పించి ప్రసాదాలు అందజేశారు.

ఇవి కూడా చదవండి:

టీడీపీలో జాయినై 2 నెలలు దాటినా కన్నాకు ఇంకా ఏ పదవి దక్కలే..!

Advertisement

Next Story

Most Viewed