- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Narayana: కారుకూతలు కూస్తే ఊరుకోం.. దమ్ముంటే బయటకు రా!
దిశ, చిప్పగిరి : దేవనకొండ మండలానికి అభివృద్ధి చేయలేదని ఎవరో చెబితే మంత్రి గుమ్మనూరు జయరాంను సోషల్ మీడియాలో విమర్శలు చేయడం తగదని ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ ఆగ్రహ వ్యక్తం చేశారు. దేవనకొండ మండల అభివృద్ధిపై దమ్ముంటే బహిరంగంగా చర్చకు రావాలంటూ ఆయన సవాల్ విసిరారు. గుమ్మనూరులోని తన నివాస గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుమ్మనూరు నారాయణ మాట్లాడుతూ దేవనకొండ మండలం పొట్లపాడు గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త బోడెద్దుల కిరణ్ అనే యువకుడు మంత్రి గుమ్మనూరు జయరాంను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడన్నారు. గత పాలకుల హాయంలో దేవనకొండ మండలం పెత్తందార్ల కనుసైగల్లో పాలన సాగుతూ అభివృద్ధికి నోచుకోలేక ఫ్యాక్షన్ కోరల్లో అనేకమంది అమాయకులు బలి అయిన విషయం కిరణ్‌కు తెలియదా? అని ప్రశ్నించారు.
ఎమ్మెల్యే, మంత్రిగా ఎన్నికైన జయరామన్న ఎలాంటి ఫ్యాక్షన్ గొడవలకు తావు లేకుండా అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని నారాయణ తెలిపారు. దేవనకొండ మండల రైతన్నల చిరకాల వాంఛ అయిన హంద్రీనీవా కాలువ నుండి దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తుండడం అభివృద్ధి కాదా అని ఆయన ప్రశ్నించారు. పెత్తందార్ల పాలనకు స్వస్తి పలికి అందరు కలిసిమెలిసి అన్నదమ్ముల ఉండేలా పాలన అందిస్తున్న మంత్రి జయరామన్నపై ఇంకొకసారి పిచ్చి కూతలు మాట్లాడడం, పోస్ట్లు చేయడం చేస్తే తగినబుద్ధి చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. పోస్ట్ చేసిన నీవు, నీ తండ్రి రైతు భరోసా పథకం అందుకుంటున్నారని, మీ అవ్వ, మీ అమ్మ ఇద్దరికీ పింఛన్లు వస్తుండడం వాస్తవం కాదా అంటూ మండిపడ్డారు. ఇక ముందు కారుకూతలు కూస్తే ఊరుకునేది లేదని నారాయణ హెచ్చరించారు.