- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YSRCP స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కుడుపూడి సూర్యనారాయణ రావు
దిశ, అమలాపురం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థానిక సంస్థల అభ్యర్థిగా రాష్ట్ర శెట్టిబలిజ మహానాడు కన్వీనర్ కుడుపూడి సూర్యనారాయణ రావు పేరు దాదాపు ఖరారు అయింది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. దాదాపు అరగంటసేపు ముఖ్యమంత్రితో సమావేశమై పలు విషయాలను చర్చించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ శాసనసభ్యుడు దివంగత కుడుపూడి చిట్టి అబ్బాయి కుమారుడు భరత్ భూషణ్ ఆశించారు. అదేవిధంగా మాజీ మంత్రి దివంగత కుడుపూడి ప్రభాకర్ రావు కుమారుడు కుడిపూడి బాబు కూడా రేసులో కలబడ్డారు.
కాగా మాజీ మున్సిపల్ ప్రతిపక్ష నేత చెల్లి బోయిన శ్రీనివాసరావు కు మంత్రి విశ్వరూప్ అండదండలతో ఆయన పేరు దాదాపు ఖరారు అయినట్లు ప్రచారం జరిగింది. దానికి తోడు మరో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు ఆయన బంధువు కావడంతో మరింత బలం చేకూరింది. దాంతో చెల్లిబోయినకు టిక్కెట్టు అంటూ ప్రచారం ముమ్మరంగా సాగింది. ఈ దశలో కుడిపూడి సూర్యనారాయణ రావు రంగ ప్రవేశం చేశారు. రాజ్యసభ సభ్యుడు పిల్లీ సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చక చకా పావులు కదిపారు.
పార్లమెంటు సమావేశాల్లో ఉన్న ఉభయ గోదావరి జిల్లాల ఇన్ చార్జి మిధున్ రెడ్డిని కలిసి వ్యూహం రచించారు. అందుకు అనుగుణంగా సూర్యనారాయణరావును ఢిల్లీకు తీసుకువెళ్లారు. ప్రస్తుతం కోనసీమలో ఉన్న పరిస్థితుల్లో దూరమైన శెట్టి బలిజలను పార్టీకి దరి చేర్చాలంటే ఒక్క సూర్యనారాయణ రావు వల్లనే సాధ్యమవుతుందన్న విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు.