- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vasireddy Padma: అంధురాలి హత్యపై సీరియస్.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
దిశ, డైనమిక్ బ్యూరో: దారుణ హత్యకు గురైన అంధురాలి మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చూసి మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతురాలి తల్లి, పెద్దమ్మలను పరామర్శించి జరిగిన దారుణంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నిందితుడికి కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
టీడీపీ మహిళా కార్యకర్తల అరెస్ట్
మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ వచ్చారన్న విషయం తెలుసుకున్న తాడేపల్లికి చెందిన టీడీపీ మహిళా కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చైర్ పర్సన్ కారుకి అడ్డంగా బైటాయించారు. మహిళలపై జరుగుతున్న దాడులపై పద్మ స్పందించాలని డిమాండ్ చేశారు. ఆడవారికి రక్షణ కల్పించలేని జగన్ రెడ్డి ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రంలో అసలు దిశ చట్టం ఉందా లేదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటికి కూతవేటు దూరంలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ఎలాంటి చర్యలు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే చైర్‌పర్సన్ కారుకు దారివ్వకుండా టీడీపీ నేతలు నిరసన తెలియజేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.