- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Breaking: విజయవాడలో భారీగా బంగారం పట్టివేత..
దిశ, వెబ్ డెస్క్: అక్రమంగా బంగారం తరలిస్తున్న నలుగురిని విజయవాడలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.7.48 కోట్ల విలువైన 12.97 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు రాష్టంలోకి అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. కస్టమ్స్ చట్టం 1962 నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు. నిందితులను విచారిస్తున్నారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
కాగా రాష్ట్రంలో కస్టమ్స్ అధికారులు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా బంగారం, గంజాయి అక్రమంగా సరఫరా జరుగుతోంది. అక్రమార్కులు ఏదో రూపంలో రెచ్చిపోతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి విజయవాడ మీదుగా యదేచ్ఛగా తరలిస్తున్నారు. ఇటీవల కాలంలో పోలీసుల తనిఖీల్లో గంజాయి భారీగా పట్టుబడుతోంది. కోట్ల విలువైన గంజాయిని పోలీసులు ధ్వంసం చేస్తున్నారు. తాజాగా బంగారాన్ని కూడా అక్రమంగా తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు, కస్టమ్స్ అధికారులు ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
ఇవి కూడా చదవండి : సీఎం జగన్ నివాసంలో ఘనంగా ఉగాది వేడుకలు