Tipper Lorry mayhem: ముగ్గురు ఎంసీఏ విద్యార్థులకు తీవ్రగాయాలు

by srinivas |   ( Updated:2023-02-15 10:45:03.0  )
Tipper Lorry mayhem: ముగ్గురు ఎంసీఏ విద్యార్థులకు తీవ్రగాయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కృష్ణా జిల్లా బందరు మండలం కృష్ణా యూనివర్సిటీ వద్ద టిప్పర్ బీభత్సం సృష్టించింది. యూనివర్సిటీ నుంచి విజయవాడ నగరానికి వెళ్తున్న విద్యార్థులను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. ముగ్గురు విద్యార్థులు కృష్ణా యూనివర్సిటీలో ఎంసీఏ చేస్తున్న పవన్, దీపిక, సుప్రజలుగా గుర్తించారు. అయితే వీరిలో పవన్, సుప్రజల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Next Story