దుర్గగుడి అభివృద్ధిపై మంత్రి ఆనం సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

by srinivas |
దుర్గగుడి అభివృద్ధిపై మంత్రి ఆనం సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ దుర్గ గుడి(Vijayawada Durga Temple) అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘ప్రసాద్ పథకం’(Prasad scheme) ద్వారా గుడిని డెవలప్‌మెంట్ చేయాలని భావిస్తోంది. దుర్గ గుడిలో సనాతన ధర్మం పాటించడంతో పాటు ఆగమ శాస్రాలు, వైదిక ఆచారాల ఆధారంగా మాస్టర్ ప్లాన్ రెడి చేయాలని నిర్ణయించింది. అయితే ప్రసాద్ పథకం ద్వారా నిధులు ఎలా రాబట్టాలనే అంశంపై ఎంపీ కేశినేని చిన్ని(MP Keshineni Chinni), దేవాదాయ శాఖ అధికారులతో విజయవాడలో ఆదివారం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి(Minister Anam Ramanarayana Reddy) సమీక్ష నిర్వహించారు. ప్రసాద్ పథకం రూల్స్ మారుతున్నాయని, అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు, ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు మంత్రి ఆనం రామనారాయరెడ్డి సూచించారు.

దేవాదాయ, పర్యాటక శాఖ అధికారులు సమన్వయంతో పని చేసి ప్రణాళికలు రూపొందించాలని, అప్పుడే కేంద్రం నుంచి నిధులు విడులయ్యే ఛాన్స్ ఉందని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. గత పాలకులు ఆలయంలో సంప్రదాయాలు పాటించలేదని, తమ ప్రభుత్వంలో కచ్చితంగా అనుసరిస్తామని చెప్పారు. భక్తులు ఎక్కువ సమయం క్యూ లైన్‌లో నిల్చోకుండా వెయిటింగ్ రూములు నిర్మించాలన్నారు వందేళ్లను దృష్టిలో పెట్టుకుని భక్తుల సౌకర్యాలు, మౌలిక వసతులపై కచ్చితమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed