BJP MLA: ఈరోజుతో తెలంగాణలో కాంగ్రెస్ పతనం మొదలైంది

by Gantepaka Srikanth |
BJP MLA: ఈరోజుతో తెలంగాణలో కాంగ్రెస్ పతనం మొదలైంది
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం(BJP state office)పై యూత్ కాంగ్రెస్ నేతలు చేసిన దాడిపై బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి(Paidi Rakesh Reddy) స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజుతో తెలంగాణలో కాంగ్రెస్(Telangana Congress) పతనం మొదలైందని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కచ్చితంగా కాంగ్రెస్‌కు తగిన విధంగా జవాబు ఇస్తామని అన్నారు. ‘తెలంగాణ బీజేపీ నేతలు పులిబిడ్డలు.. ఇవాళ కాంగ్రెస్ నేతలు పులులతో పెట్టుకున్నారు.

ఇక తామేంటో చూపించాల్సిన టైమొచ్చింది. తెలంగాణ నుంచి కాంగ్రెస్‌ను తరిమే వరకు తాము నిద్రపోము’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేష్ బిధూరీ(Ramesh Bidhuri) చేసిన వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) బుగ్గల్లా మారుస్తానంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్(Congress) నేతలు బీజేపీ స్టేట్ ఆఫీస్‌పై దాడికి యత్నించారు.

Advertisement

Next Story