Vande Bharat Express:: ఏపీకి మరో వందేభారత్ రైలు

by srinivas |   ( Updated:2023-07-03 10:53:44.0  )
Vande Bharat Express:: ఏపీకి మరో వందేభారత్ రైలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైల్వే శాఖ మరో తీపికబురు చెప్పింది. రాష్ట్రానికి మరో వందేభారత్ రైలు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ రైలు విజయవాడ-చెన్నై మధ్యతిరగనుంది. ఈ నెల 7నుంచి వందేభారత్ రైలు రాకపోకలు ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు.

కాగా ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా ఐదు వందేభారత్‌ రైళ్లను వర్చువల్‌ విధానంలో ప్రారంభించనున్నారు. విజయవాడ-చెన్నై మధ్య నడిచే కొత్త రైలు కూడా ఉంటుందని విజయవాడ డివిజన్‌ రైల్వే అధికారులకు తెలిపారు. అయితే విజయవాడ నుంచి చెన్నై వెళ్లే రైలు జులై 8 నుంచి పూర్తి స్థాయిలో రాకపోకలు ప్రారంభింస్తుందని అధికారులు చెబుతున్నారు. విజయవాడ నుంచి చెన్నై వెళ్లే వందేభారత్‌ రైలుకు ఏయే స్టేషన్లలో హాల్ట్‌, రాకపోకలు, టిక్కెట్‌ ధరలు, ప్రయాణ సమయం వంటి షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించబోతున్నట్లు విజయవాడ డివిజన్‌ రైల్వే అధికారులు ప్రకటించారు.

Advertisement

Next Story