- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vijayawada Drugs Case: వెలుగులోకి కీలక విషయాలు
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ డ్రగ్స్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. కీలక ఆధారాలను సేకరించారు. ఈ కేసులో నిందితుడు సుహాస్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. అంతేకాదు ఏ1గా చేర్చారు. నిందితుడు సుహాస్ ఆరు నెలలుగా డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. సుహాస్ కుటుంబసభ్యులను కూడా విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. అయితే బెంగళూరు నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్న శశిని కూడా విజయవాడకు తీసుకొచ్చారు. శశి సహా కుంచనపల్లికి చెందిన శేషు, మాస్వామికి డ్రగ్స్‌తో సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. శేషును కస్టడీ పిటిషన్ ద్వారా ప్రశ్నించాలని పోలీసులు యోచిస్తున్నారు.
కాగా మూడు రోజుల క్రితం అనంతపురం నుంచి విజయవాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. ఆర్టీసీ డ్రైవర్‌తో పాటు ఓ వ్యక్తిని పోలీసులు విచారించారు. వ్యక్తి కాల్ లిస్ట్ ఆధారంగా నిందితులను గుర్తించారు. బెంగళూరు కేంద్రంగా అనంతపురం, విజయవాడతో పాటు పలు ప్రాంతాలకు డ్రగ్స్ తరలిస్తున్నట్లు నిర్ధారించారు. ఈ క్రమంలోనే ఇద్దరు నిందితులు సుహాస్, శశిని అదుపులోకి తీసుకున్నారు.