- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vijayawada: చంద్రబాబు ఆరోగ్యంపై ఎగతాళి చేసిన మంత్రి మేరుగు
దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రాజమండ్రి సెంట్రల్ జైలులో స్కిల్ అలర్జీ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇదే విషయంపై మంత్రి మేరుగు నాగార్జున ఎగతాళి చేస్తూ మాట్లాడారు. చంద్రబాబుకు డీహైడ్రేషన్, అలర్జీపై ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రశ్నలకు తనకు జలుబు చేసిందని, టాబ్లెట్లు వేసుకుంటే తగ్గింపోతోందని ఎద్దేవా చేశారు. అలాగే చంద్రబాబుకు కూడా వైద్యులు సూచించిన మందులు వేసుకుంటే సరిపోతుందని సెటైర్లు వేశారు. విజయవాడ స్వరాజ్ మైదాన్‌లో నిర్మిస్తున్న అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆరోగ్యంపై మరోలా స్పందించారు. దీంతో మంత్రి నాగార్జునపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యం విషయంలోనూ విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు.