Breaking: ఉద్రిక్తత.. ఇంట్లోనే మండలి బుద్ధ ప్రసాద్ అరెస్ట్

by srinivas |
Breaking: ఉద్రిక్తత.. ఇంట్లోనే మండలి బుద్ధ ప్రసాద్  అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఉద్రికత్త చోటు చేసుకుంది. టీడీపీ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అవనిగడ్డ నియోజకవర్గంలో జరుగుతున్న మట్టి మాఫియా ఆగడాలను అడ్డుకోవాలని ఆయన నిరసన వ్యక్తం చేశారు. నాగాయలంక ఎమ్మార్మో కార్యాలయం ముట్టడికి పిలుపు నిచ్చారు.

ఈ నేపథ్యంలో మండలి బుద్ధ ప్రసాద్‌ను అవనిగడ్డలోని ఆయన ఇంటి వద్దే అదుపులోకి తీసుకుని కోడూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీస్ వాహనం ముందు టీడీపీ కార్యకర్తలు బైఠాయించారు. అయితే టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టి మండలి బద్ధ ప్రసాద్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఇక ఈ ఘటనపై మండలి బుద్ధ ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక మాఫియా దోపిడీపై నిరసన వ్యక్తం చేస్తే పోలీసులు తమను అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే తమపై ప్రతాపం చూపించడం పోలీస్ శాఖకు సిగ్గు చేటని ఆవేదన వ్యక్తం చేశారు. తనను అరెస్ట్ చేసినంత మాత్రాన ప్రజా ఉద్యమం ఆగదని మండలి బుద్ధ ప్రసాద్ హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed