- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ward Volunteer Case: కాసేపట్లో విచారణ.. పవన్‌కు సమన్లు జారీ చేసే ఛాన్స్
దిశ, వెబ్ డెస్క్: ఉమెన్ ట్రాఫికింగ్‌పై వార్డు వాలంటీర్లను ఉద్దేశించి జససేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అటు విజయవాడలోనూ పవన్ కల్యాణ్‌పై పలువురు మహిళా వార్డు వాలంటీర్లు, వైసీపీ నేతలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఏలూరు వారాహి యాత్రలో పవన్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పవన్ కల్యాణ్‌పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
అయితే కేసుకు సంబంధించిన విచారణ కాసేపట్లో విజయవాడ సిటీ సివిల్ కోర్టులో జరగనుంది. ఇప్పటికే వాలంటీర్ల స్టేట్‌మెంట్‌ను విజయవాడ మెట్రో పాలిటిన్ కోర్టు న్యాయమూర్తి రికార్డు చేశారు. ఇక పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఇవాళ వాలంటీర్ల తరఫున సాక్షుల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు. విచారణ తర్వాత పవన్ కల్యాణ్‌కు సమన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.