Nanidigama: వరద ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం

by srinivas |   ( Updated:2024-09-04 14:45:53.0  )
Nanidigama: వరద ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం
X

దిశ, వెబ్ డెస్క్: వరద ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు(Former Mla Mondithoka Jaganmohan Rao)కు చేదు అనుభవం ఎదురైంది. కృష్ణా జిల్లా నందిగామ మండలం కంచికచర్లలో (Nandigama)లో వరద బాధితులను పరామర్శించేందుకు ఆయన వెళ్లారు. అయితే జగన్మోహన్ రావును స్థానికులు, టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. వరదలతో రెండు రోజులుగా ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు పరామర్శించడానికి వచ్చావా అంటూ నిలదీశారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. రాజకీయ లబ్ధికోసం వస్తావా అంటూ జగన్ మోహన్ రావుపై మండిపడ్డారు. దీంతో చేసేదేమీలేక ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కాగా మున్నేరు వాగు ( Munneru Wagu)పొంగడంతో కృష్ణా జిల్లా నందిగామ, కంచికచర్ల వరద బీభత్సం సృష్టించాయి. లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. ఇళ్లు, రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. హైదరాబాద్- విజయవాడ హైవేపై రాకపోకలు సైతం నిలిచిపోయాయి.. వరద ఉధృతి తగ్గడంతో రాకపోకలు పునరుద్ధరణ అయ్యాయి. అయితే వరదలు (Floods)దెబ్బకు రెండు రోజులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే స్థానికులు, పలువురు నాయకులు వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడుతుండటంతో మరికొంతమంది నాయకులు పరామర్శలకు వెళ్తున్నారు. దీంతో తీరిగ్గా పరమర్శలకు రావడంపై పలువురు స్థానికులు, లోకల్ నాయకులు మండిపడ్డుతున్నారు. అడ్డుకుని వెనక్కుపంపుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed