CPS Fighting Unions: జీపీఎస్‌ను ఒప్పుకోం.. ఓపీఎస్ అమలు చేయాల్సిందే

by srinivas |
CPS Fighting Unions: జీపీఎస్‌ను ఒప్పుకోం.. ఓపీఎస్ అమలు చేయాల్సిందే
X

దిశ, వెబ్ డెస్క్: జీపీఎస్ వద్దని.. ఓపీఎస్ ముద్దని సీపీఎస్ పోరాట సంఘాల నేతలు అన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్నికల ముందు వైఎస్ జగన్ ఇచ్చిన హామీని నెరవేల్చాలని డిమాండ్ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేసే వరకు అన్ని ఉద్యోగ సంఘాలతో పోరాటం చేస్తామని చెప్పారు. జీపీఎస్ విధానాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోమని హెచ్చరించారు.

ఈ నెల 19, 26వ లేదీల్లో సీపీఎస్‌పై స్పందనలో రెఫరెండం నిర్వహిస్తామన్నారు. జులై 8న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేస్తామని చెప్పారు. కొంతమంది జేఏసీ నాయకులు స్వార్థంతో వ్యవహరిస్తు్న్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇస్తానంటున్న జీపీఎస్‌ను తొలుత వారికి అమలు చేయాలని.. అది విజయవంతమైతే మిగిలిన ఉద్యోగులకూ అమలు చేయాలని సీపీఎస్ పోరాట సంఘాల నేతలు తెలిపారు.

Advertisement

Next Story