- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Skill Case: చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దు.. 186 పేజీల కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ
దిశ, వెబ్ డెస్క్: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు సీఐడీ కస్టడీ విచారణ కొనసాగుతోంది. తొలి రోజు శనివారం సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. ఆదివారం సైతం చంద్రబాబును అధికారులు ప్రశ్నించారు. ఇదిలా ఉంటే చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన తరఫున లాయర్లు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ ఆదివారం జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని సీఐడీ పట్టుబడుతోంది. ఇప్పటికే కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దంటూ 185 పేజీల కౌంటర్ దాఖలు చేసింది. కేసు దర్యాప్తు వివరాలు, సేకరించిన ఆధారాలను కౌంటర్‌లో రూపొందించింది. ఈ కేసులో సెక్షన్లు 409, 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని కౌంటర్‌లో పేర్కొంది. మరోవైపు 17ఏ చంద్రబాబుకు వర్తించదని ఆయన తరఫున లాయర్లు వాదిస్తున్నారు. ఆ సెక్షన్ ఎందుకు వర్తించదని సీఐడీ అధికారులు కౌంటర్‌గా ప్రశ్నిస్తున్నారు. దీంతో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఎలాంటి తీర్పు వస్తుందోనని టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.