కేశినేని నాని రాజీనామా.. తమ్ముడు చిన్ని షాకింగ్ రియాక్షన్

by srinivas |   ( Updated:2024-01-06 11:01:55.0  )
కేశినేని నాని రాజీనామా..  తమ్ముడు చిన్ని షాకింగ్ రియాక్షన్
X

దిశ, వెబ్ డెస్క్: కేశినేని బ్రదర్స్ మధ్య విజయవాడ ఎంపీ సీటు చిచ్చు పెట్టిన విషయం తెలిసిందే. అయితే విజయవాడ ఎంపీగా ఉన్న తనకు కాదని అధిష్టానం తమ్ముడు చిన్నిని ఖరారు చేయడంపై కేశినేని నాని తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. దీంతో టీడీపీకి ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అన్న రాజీనామా విషయం తనకు తెలియదని కేశినేని చిన్ని షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు.

సమస్యలు సహజమే....


ఏ కుటుంబంలో అయినా సమస్యలు ఉంటాయని, టీడీపీలోనూ ఉన్నాయని చిన్ని చెప్పారు. కానీ అన్నింటిని సర్దుకుని అందరం కలిసి కట్టుగా ఉంటామని చెప్పారు. ఎదురు పార్టీల్లోనూ సమస్యలు వచ్చి ఖాళీ అవుతున్నాయన్నారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీల్లో ఎవరూ ఉండటంలేదని తెలిపారు. అటువంటి పార్టీలతో చూసుకుంటే టీడీపీలో ఏదో అయిపోతుందనుకుంటే పొరపాటేనని చెప్పారు. చిన్న చిన్న గొడవలను భూతద్ధంలో చూస్తే ఎవరూ ఏమీ చేయలేమన్నారు. తిరువూరు సభలో ఎంపీగా నానికి ఇచ్చే గౌరవం, ప్రోటోకాల్ ఉంటుందని తెలిపారు. తిరువూరు సభకు కేశినేని నాని వస్తారని తామందరం భావిస్తున్నామన్నారు. తిరువూరు చంద్రబాబు సభను విజయవంతం చేస్తామని కేశినేని చిన్ని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story