- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడీపీ తొలి జాబితా విడుదల... మండలి బుద్ధ ప్రసాద్ తీవ్ర అసంతృప్తి
దిశ, వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల టీడీపీ తొలి జాబితా విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే ఈ జాబితాలో తనకు సీటు ప్రకటించకపోవడంపై అవనిగడ్డ టీడీపీ ఇంచార్జి మండలి బుద్ధప్రసాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన పేరు ప్రకటించకపోవడం ఎంతో మహానందంగా ఉందని ఆయన తెలిపారు. పంజరంలోంచి బయటకు వచ్చినట్టుందని తెలిపారు. తాను పదవుల కోసం పుట్టలేదన్నారు. రాజకీయాల తన కళ్లముందు మారిపోతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. డబ్బే రాజకీయాల్లో ప్రాధాన్యమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు వస్తుండటంతో పార్టీ అధిష్టానాలు డబ్బున్న వాళ్ల కోసం అన్వేషిస్తున్నాయంటూ విమర్శలు చేశారు.
కాగా టీడీపీ అవనిగడ్డ ఇంచార్జిగా మండలి బుద్ధ ప్రసాద్ పని చేస్తున్నారు. అయితే ఉమ్మడి అభర్థిగా అవనిగడ్డ నుంచి తనకు సీటు కేటాయిస్తారని ఆశించారు. అయితే అవనిగడ్డ సీటును జనసేనకు కేటాయించినట్లు ఆయనకు సంకేతాలు అందాయి. దీంతో మండలి బుద్ధ ప్రసాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Read More..
టీడీపీలో చిచ్చు రేపిన తొలి జాబితా.. పెనుగొండలో తీవ్ర వ్యతిరేకత