- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: పురంధేశ్వరిని టార్గెట్ చేసిన పోసాని.. మద్యం స్కాంపై మాట్లాడటంతో తీవ్ర విమర్శలు
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మద్యం స్కాం, చంద్రబాబు అరెస్ట్ తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలపై ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణ మురళి మండిపడ్డారు. విజయవాడ వైసీపీ కార్యాలయంలో మాట్లాడుతూ చంద్రబాబు లాంటి క్రిమినల్స్‌ను కాపాడటమే తమ మెంటాల్టీనా అని పోసాని ప్రశ్నించారు. ఎన్టీఆర్ హయాంలో మద్యపాన నిషేధం అమలు చేస్తే.. చంద్రబాబు హయాంలో ఎత్తివేసిన విషయం గుర్తుందా అని నిలదీశారు. ఎన్టీఆర్‌కు వెన్ను పొడిచి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇస్తానని చంద్రబాబు చెప్పలేదా అని ప్రశ్నించారు. ఆ తర్వాత వెంకటేశ్వరరావుకు ఆ పదవి ఇవ్వలేదు కదా? అని పోసాని వ్యాఖ్యానించారు. అసలు పురంధేశ్వరి ఎన్ని పార్టీలు మారతారన్నారు. అప్పుడు కాంగ్రెస్.. ఇప్పుడు బీజేపీ అని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాకపోతే పురంధేశ్వరి మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళతారని పోసాని జోస్యం చెప్పారు.
ఇక బాలకృష్ణపై కూడా విమర్శలు చేశారు. గతంలో బెల్లంకొండ సురేశ్‌పై కాల్పులు జరిపిన విషయాన్ని గుర్తు చేస్తూ విమర్శలు కురిపించారు. ఆ కేసు నుంచి బాలకృష్ణను కాపాడింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని పోసాని వ్యాఖ్యానించారు.