- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: విద్యార్థుల యూనిఫామ్‌లో మార్పులు
దిశ, డైనమిక్ బ్యూరో: విద్యారంగంలో ఢిల్లీ కంటే రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విద్య, వైద్య రంగాలకు సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. విజయవాడలో రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థుల యూనిఫామ్‌లో మార్పులు చేయబోతున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు హుందాగా ఉండేలా యూనిఫామ్ రూపొందిస్తామన్నారు. అలాగే ప్రతి తరగతి గదిలో స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ కంటే ఎక్కువగా విద్యారంగంలో సౌకర్యాలు అందిస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని మంత్రి బొత్స స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిషేధించేందుకు చాలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ ర్యాగింగ్ భూతంపై పాఠశాల నుంచే అవగాహన కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. విద్యార్థులకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా టీచర్లకు తెలియజేయాలని మంత్రి సూచించారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు.