- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోడికత్తి కేసులో కీలక పరిణామం: వైఎస్ జగన్ హాజరుకావాల్సిందేనా?
దిశ, డైనమిక్ బ్యూరో : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోడికత్తి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణను విజయవాడ ఎన్ఐఏ కోర్టు విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టుకు బదిలీ చేసింది. ఈ మేరకు విజయవాడ ఎన్ఐఏ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై కోడికత్తి కేసులో వాద ప్రతివాదనలు విశాఖ ఎన్ఐఏ కోర్టులో జరుగుతుందని కోర్టు స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఆగస్టు 8కి వాయిదా వేసింది. ఈ కోడికత్తి కేసులో 80శాతం ట్రయల్స్ పూర్తి అయిన తర్వాత మరో కోర్టుకు బదిలీ చేయడంపై నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు తరఫు న్యాయవాది గగన సింధు అన్నారు. ఇప్పటికే నాలుగు సంవత్సరాల 5 నెలలుగా శ్రీనివాసరావు జైల్లోనే మగ్గుతున్నాడని చెప్పుకొచ్చారు. ఈ కేసు విషయంలో వైఎస్ జగన్ కోర్టుకు హాజరుకావాల్సిందేనని చెప్పుకొచ్చారు. కేసు కొలిక్కిరావాలంటే ఖచ్చితంగా వైఎస్ జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాల్సిందేనని అన్నారు. ఈ కోడికత్తి కేసును తేలిగ్గా వదిలే ప్రసక్తే లేదని...పూర్తి స్థాయిలో తమ వాదనలు వినిపిస్తామని న్యాయవాది గగన సింధు తెలిపారు.
Read More : ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఉంది: YS Jagan Mohan Reddy