కొడాలి నాని నాలుకకు త్వరలోనే వాతలు పెడతాం: మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

by Seetharam |   ( Updated:2023-10-26 11:26:49.0  )
కొడాలి నాని నాలుకకు త్వరలోనే వాతలు పెడతాం: మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
X

దిశ, డైనమిక్ బ్యూరో : గుట్కా, మట్కా, క్యాసినో బ్యాచ్‍లకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గొప్పతనం ఏం తెలుస్తోందని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. జగన్ మెచ్చుకోలు, పదవుల కోసం మాజీమంత్రి కొడాలి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు కొడాలి మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. స్కిల్ స్కాం కేసులో ఇవాళో, రేపో కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకొస్తారు అని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆశాభావం వ్యక్తం చేశారు. చిలకలూరిపేటలో గురువారం మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మీడియాతో మాట్లాడారు. మతిభ్రమించిన కొడాలి నానిని పిచ్చాస్పత్రికి తరలించాలని సూచించారు. ఎందరో మహానుభావులు పుట్టిన గుడివాడ గడ్డపై కొడాలి నాని చెడబుట్టారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీమంత్రి కొడాలి నాని బూతు పురాణం వెనుక తాడేపల్లి ప్యాలెస్ ఉందని ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. చంద్రబాబు కుటుంబంపై పిచ్చి ప్రేలాపనలు పేలితే సహించేది లేదని హెచ్చరించారు. ఇలానే వ్యవహరిస్తే త్వరలోనే కొడాలి నాని నాలుకకు వాతలు పెడతామని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీలో నారా భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలను తమతోపాటు ఈ రాష్ట్ర ప్రజలు మరచిపోలేదని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story