సిగ్గులేకుండా పొగుడుతున్నారు.. హీరో రజినీకాంత్‌పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

by Satheesh |
సిగ్గులేకుండా పొగుడుతున్నారు.. హీరో రజినీకాంత్‌పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా స్టార్ హీరో రజినీకాంత్ టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఐటీ అంటే సరిగా తెలియని రోజుల్లోనే చంద్రబాబు ఐటీని విస్తృతంగా ప్రమోట్ చేశారని కొనియాడారు. దీంతో హీరో రజినీకాంత్‌పై వైసీపీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. రజినీకాంత్ చంద్రబాబుకు భజన చేసేందుకు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు వచ్చారని మంత్రి రోజా ప్రశ్నించగా.. తాజాగా రజినీకాంత్‌పై మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలినాని ఫైర్ అయ్యారు. రజినీకాంత్ సిగ్గులేకుండా చంద్రబాబును పొగుడుతున్నారంటూ కొడాలి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను బ్లాక్ మెయిల్ చేసేందుకే రజినీకాంత్‌ను రంగంలోకి దింపారని సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు రాజకీయాలు ఇప్పటికైనా పవన్ కల్యాణ్ గ్రహించాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed