- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు, రజినీకాంత్‌లపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌లకు ఇక భవిష్యత్ లేదని మాజీమంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం చంద్రబాబు హైదరాబాద్ ఆసుపత్రిలో ఉంటే.. రజినీకాంత్ చెన్నై హాస్పిటల్‌లో ఉంటాడని ధ్వజమెత్తారు. ఇద్దరికీ ఆసుపత్రుల చుట్టూ తిరగడంతోనే సరిపోతుందని విమర్శించారు. చంద్రబాబు ఒక ఎకరం భూమి కొనుగోలు చేసి మంచి నీటి అవసరాలు తీర్చాడని చెప్తే.. తాను రాజకీయాలు వదిలేసి వెళ్లిపోతానని కొడాలి నాని ఛాలెంజ్ చేశారు. గుడివాడ ఆర్టీసీ డిపో ప్రారంభోత్సవంలో మాజీమంత్రి కొడాలి నాని మాట్లాడారు.
పాలనలో చంద్రబాబుకి, సీఎం జగన్‌కి నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పుకొచ్చారు. 2,300 మంది ఆర్టీసీ కుటుంబాలను చంద్రబాబు గాలికొదిలేసాడంటూ ధ్వజమెత్తారు. గుడివాడ ప్రజల దాహార్తి తీర్చిన మహానుభావుడు రాజశేఖరరెడ్డి అయితే.. ఫ్లైఓవర్ కట్టిన మహానుభావుడు ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు 14 ఏళ్లలో ఏం చేశారని మాజీమంత్రి కొడాలి నాని నిలదీశారు.