న్యూలుక్‌లో కొడాలి నాని: సోషల్ మీడియాలో వైరల్‌గా ఫోటోలు

by Seetharam |
న్యూలుక్‌లో కొడాలి నాని: సోషల్ మీడియాలో వైరల్‌గా ఫోటోలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీమంత్రి కొడాలి నాని. ఏపీ రాజకీయాల్లో ఓ ఫైర్ బ్రాండ్. చంద్రబాబు కుటుంబంపై విరుచుకుపడే నాయకుల్లో మెుదటి వ్యక్తి. కొడాలి నాని రాజకీయ నాయకుడు అయినప్పటికీ అతడి స్టైల్ వేరు. చేతికి తాళ్లు, కంకణాలతో మెడలో రుద్రాక్షలతో దర్శనిమిస్తూ ఉంటారు. అంతేకాదు మాస్ లుక్‌లో కనిపిస్తారు. కానీ రాజస్థాన్‌లో మాత్రం కొడాలి నాని రూట్ మార్చారు. మిత్రుడు ఇంట జరుగుతున్న వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని న్యూలుక్‌తో దర్శనమిచ్చారు. ఈ న్యూలుక్‌లో కొడాలి నాని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక అంశంలో వార్తల్లో నిలిచే కొడాలి నాని ఇటీవలే రాజకీయాలకు దూరంగా రాజస్థాన్ వెళ్లారు. తన మిత్రుడు కీర్తి కుమార్ జీవత్ ఇంట జరగుతున్న పెళ్లి వేడుకల్లో కొండాలి నాని ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పెళ్లి వేడుకల్లో పాల్గొన్న మాజీమంత్రి కొడాలి నాని ఫోటోలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ప్రతినిధులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. న్యూ లుక్‌తో ఉన్న కొడాలి నాని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కొడాలి నానితోపాటు వైసీపీ నేతలు దుక్కిపాటి శశి భూషణ్, పాలడుగు రాంప్రసాద్, ఎమ్మెల్యే అనుచరులు వల్లూరు పల్లి సుధాకర్, గుడ్లవల్లేరు బాబ్జి పాల్గొన్నారు.

Advertisement

Next Story