ఆయా అత్యుత్సాహం వల్లే శిశువుల తారుమారు: కేజీహెచ్ సూపరింటెండెంట్

by srinivas |   ( Updated:2025-02-27 10:43:29.0  )
ఆయా అత్యుత్సాహం వల్లే శిశువుల తారుమారు: కేజీహెచ్ సూపరింటెండెంట్
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ కేజీహెచ్‌(Vishaka Kgh)లో శిశువుల తారుమారు ఘటనలో పురోగతి లభించింది. శిశువులను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు అధికారులు. ఈ ఘటనపై కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద(KGH Superintendent Sivananda) మాట్లాడుతూ ఏడుగురు సభ్యులతో విచారణ జరిపించినట్లు తెలిపారు. శిశువులు తారుమారు అనేది ఎప్పుడూ జరగలేదన్నారు. ఇప్పుడు ఆయా అత్యుత్సాహం వల్లే ఇలా జరిగిందని శివానంద వెల్లడించారు.

విశాఖ కేజీహెచ్‌లో శిశువుల తారుమారు ఘటన బుధవారం రాత్రి కలకలం రేపింది. గైనకాలజీ వార్డులో ఒక కుటుంబానికి ఇవ్వాల్సిన శిశువును మరో కుటుంబానికి సిబ్బంది అప్పగించారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమ నిజమైన శిశువును అప్పగించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్​శివానంద సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై ఏడుగురు అధికారులతో ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజీ(cc tv footage) ఆధారంగా ఈ రోజు శిశువుల తారుమారును గుర్తించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని శివనంద తెలిపారు.

Next Story