కేబినెట్‌ సమావేశంలో ప్రధాని మోడీ ఏపీ పర్యటనపై కీలక చర్చ

by Mahesh |
కేబినెట్‌ సమావేశంలో ప్రధాని మోడీ ఏపీ పర్యటనపై కీలక చర్చ
X

దిశ, వెబ్ డెస్క్: ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం(ఏపీ కేబినెట్ సమావేశం) మంగళగిరిలోని సచివాలయంలో జరిగింది. ఈ సమావేశాల్లో మొత్తం 14 అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇందులో అమ్మఒడి, రైతులకు 20 వేలు, మత్స్యకారులకు ఫిషింగ్ హాలిడే సమయంలో రూ. 20 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే ఈ కేబినెట్ సమావేశంలో భారత ప్రధాని(Indian Prime Minister) నరేంద్ర మోడీ(Narendra Modi) పర్యటనపై సబ్ కమిటీ(Sub-committee) వేశారు. ఈ నెల 8న ప్రధాని మోడీ విశాఖపట్టణం(Visakhapatnam)లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ హబ్‌(Green Hydrogen Hub)కు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు గాను ఈ సబ్ కమిటీ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ప్రధాని మోడీ ఏపీ పర్యటన ఖరారు కావడంతో కేంద్ర బలగాలు సదరు ప్రాంతాలను పరిశీలించి.. తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. మూడో సారి మోడీ ప్రధాని అయిన తర్వాత రాష్ట్రానికి వస్తుండటంతో ఎన్డీయే(NDA)లో భాగస్వామ్యం అయిన రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే బీజేపీ(BJP) నేతలు కూడా తమ పార్టీ నేతకు గ్రాండ్ గా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed