కోడికత్తి కేసులో కీలక పరిణామం: కోర్టు విచారణపై స్టే విధింపు

by Seetharam |   ( Updated:2023-10-17 11:36:15.0  )
కోడికత్తి కేసులో కీలక పరిణామం: కోర్టు విచారణపై స్టే విధింపు
X

దిశ, డైనమిక్ బ్యూరో : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోడికత్తి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణపై హైకోర్టు మంగళవారం స్టే విధించింది. ఈ కేసు విచారణను ఆరు వారాల పాటు వాయిదా వేసింది. అలాగే సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఎన్ఐఏను ఏపీ హైకోర్టు ఆదేశించింది. కోడి కత్తి కేసులో లోతైన విచారణ జరపాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్ఐఏ కోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. జగన్‌పై కోడికత్తితో దాడి ఘటనలో ఎలాంటి కుట్రకోణం లేదని తేల్చి చెప్పేసింది. ఎన్ఐఏ కోర్టు తీర్పును ఏపీ హైకోర్టులో సీఎం జగన్ సవాల్ చేశారు. ఈ కేసులో కుట్రకోణం దాగి ఉందని భావిస్తున్నానని.. ఈ నేపథ్యంలో లోతైన విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ హైకోర్టును సీఎం జగన్ తరఫు న్యాయవాదులు కోరారు. ఈ తరహా పిటిషన్‌ను కొట్టివేసిన విషయాన్ని ఎన్ఐఏ తరఫు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వదాలను విన్న హైకోర్టు... విశాఖపట్ణణం ఎన్ఐఏ కోర్టు జరుపుతున్న విచారణపై స్టే విధించింది. ఎనిమిది వారాలపాటు స్టే కొనసాగుతుందని తెలిపింది. మరోవైపు ఈ కేసు విచారణను హైకోర్టు ఆరువారాలపాటు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజా సంకల్ప పాదయాత్ర చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తూ విరామం ఇచ్చారు. హైదరాబాద్ వెళ్లేందుకు 2018 అక్టోబర్ 25న విశాఖపట్టణం విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో వైఎస్ జగన్ వేచి చూస్తున్నారు. ఇంతలో జనిపల్లి శ్రీనివాస్ వైఎస్ జగన్‌పై కోడికత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో జగన్ తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. ఈ ఘటనలో జగన్ ఎడమ భుజానికి స్వల్పంగా గాయమైంది. ప్రస్తుతం నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ జైలులో ఉన్నారు. ఈ కేసును విచారిస్తున్న ఎన్ఐఏ కోర్టు జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఈ నెల 14న ఏపీ హైకోర్టులో సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

Read More..

దసరా తర్వాత అన్ని డాక్యుమెంట్లను తీసుకు వస్తా: సీఐడీకి లోకేశ్ సన్నిహితుడు లేఖ

Advertisement

Next Story

Most Viewed