విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ కీలక ప్రకటన

by Satheesh |
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గతంలోనే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిందని అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ఇక, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక సెంటిమెంట్ అని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలకు మేలు జరిగేలా అడుగులు వేస్తానని అన్నారు. రాబయే ఐదేళ్లు కూటమితో కలిసి ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. కాగా, నరసాపురం ఎంపీగా విజయం సాధించిన శ్రీనివాస వర్మ.. ఏపీ నుండి మోడీ 3.0 కేబినెట్‌లో కేంద్ర మంత్రిగా పదవి దక్కించుకున్నారు. శ్రీనివాస వర్మకు మోడీ ఉక్కు పరిశ్రమ సహయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు.

Advertisement

Next Story

Most Viewed