ఆయన పార్టీ మారుతాడని అనుకోవడం లేదు.. మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-28 15:12:45.0  )
ఆయన పార్టీ మారుతాడని అనుకోవడం లేదు.. మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణపై మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. మోపిదేవి జగన్‌కు అత్యంత సన్నిహితుడు అని తెలిపారు. మోపిదేవి ఓడినా MLC ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారని గుర్తుచేశారు. ‘మోపిదేవి పార్టీని వీడతారని అనుకోవడం లేదు. అధికార పార్టీలో చేరడం అంటే క్యారెక్టర్ కోల్పోవడమే. చంద్రబాబు రాజకీయ జీవితం అందరికీ తెలుసు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి. పార్టీలు మారడం మంచి పద్ధతికాదు’ అని అంబటి రాంబాబు అన్నారు. కాగా, మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడబోతున్నట్లు కొందరు ట్వీట్‌లు చేశారు. మోపిదేవి చూపు తెలుగుదేశం పార్టీ వైపు ఉందని.. త్వరలోనే ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ఊహాగానాలు మోదలయ్యాయి. దీంతో ఈ వార్తలపై అంబటి రాంబాబు స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed