CM Chandrababu:యురేనియం తవ్వకాలకు బ్రేక్.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

by Jakkula Mamatha |
CM Chandrababu:యురేనియం తవ్వకాలకు బ్రేక్.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
X

దిశ,వెబ్‌డెస్క్: యురేనియం తవ్వకాలపై ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) కీలక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా దేవనకొండ మండలం లోని కప్పట్రాళ్ల అటవీ ప్రాంతంలో యురేనియం లభ్యత, పరిశోధనల కోసం బోర్లు వేసే ప్రతిపాదనను నిలిపివేయాలని సీఎం చంద్రబాబు(CM Chandrababu) తాజాగా ఆదేశాలు జారీ చేశారు. యురేనియం తవ్వకాలపై(Uranium Mining) రాష్ట్ర ప్రభుత్వం(State Govt) నియమించిన ‘నిజనిర్ధారణ కమిటీ’ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. యురేనియం తవ్వకాలు జరగవని తేల్చి చెప్పింది. ఇప్పటికే సీఎం చంద్రబాబు(CM Chandrababu) దీనిపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అని కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈ సమస్యను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం(Central Govt) దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. ఈ క్రమంలో దేవనకొండ ప్రజలు ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు. ఈ తవ్వకాలను వ్యతిరేకిస్తూ కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న సమీప గ్రామాల ప్రజలకు ఉపశమనం లభించినట్లయింది.

Advertisement

Next Story

Most Viewed