- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
100 రోజుల్లో మొత్తం నిర్మూలిస్తాం.. మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కొత్తగా కొలువుదీరిన టీడీపీ-జనసేన-బీజేపీల కూటమి ప్రభుత్వం స్పీడు పెంచింది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యంగా సోమవారం సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించారు. పనుల పురోగతిపై అధికారులతో మాట్లాడారు. అనంతరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడంపై అధికారులో రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. మరోవైపు డ్రగ్స్ నిర్మూలనపై మంత్రి నారా లోకేష్ దృష్టిసారించారు. సోమవారం బక్రీద్ పండుగ సందర్భంగా మంగళగిరిలోని ఈద్గాలో నిర్వహించిన ప్రార్థనల్లో లోకేష్ పాల్గొన్నారు.
అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడారు. రుషికొండ ప్యాలెస్‌లో బయటకు రావాల్సిన చిత్రాలు ఇంకా చాలా ఉన్నాయని అన్నారు. రాబోయే వందరోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌లో గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తామని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిక ముగ్గురు టీడీపీ కార్యకర్తల్ని హత్య చేశారని మండిపడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గించవద్దని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని గుర్తుచేశారు. ఆయన ఆదేశాల మేరకు తాము సంయమనం పాటిస్తున్నామని అన్నారు.