- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒళ్లు దగ్గర పెట్టుకో..ప్రజలు తరిమికొడతారు : పవన్ కల్యాణ్‌కు మంత్రి జోగి రమేశ్ వార్నింగ్
దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంట్లో పెంపుడు కుక్క స్థాయి పవన్ కల్యాణ్‌ది అని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ విమర్శించారు. ప్యాకేజీ విశ్వాసంతోనే దత్తపుత్రుడి అరుపులు అని విమర్శించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మంత్రి జోగి రమేశ్ మీడియాతో మాట్లాడారు. తల్లిని అవమానించోళ్లతో దోస్తీ చేసే స్థాయి పవన్ ది అని విమర్శించారు. జనసేన విలీనానికి హోల్‌సేల్ బేరమే టీడీపీతో పొత్తు అని అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్‌ను నమ్మిన అభిమానులంతా ఇక జెండాకూలీలే అని విమర్శించారు. ఈ పిచ్చోడి మాటలు నమ్మేదే లేదంటున్న జనసేన క్యాడర్ అంటూ జోగిరమేశ్ ఎద్దేవా చేశారు. జనసేన పేరుతో రాజకీయ పార్టీ నాయకుడిగా చెలామణయ్యే పవన్ కల్యాణ్ బతుకేంటి..? ఆయన స్థాయేంటి..? నిజ జీవితంలో ఆయనకు ఇప్పటికే మూడు పెళ్ళిళ్ళు జరిగాయి. వాటిని పక్కనబెడితే అవినీతి కేసులో దొంగలా ఆధారాలతో దొరికి జైలుపాలైన చంద్రబాబు నాయుడుతో ములాఖత్‌కు వెళ్లి మిలాఖత్ అయ్యాక పవన్ కల్యాణ్ మరో లగ్నం కుదుర్చుకున్నాడు అని జోగి రమేశ్ వివరించారు. జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశమని తాడూబొంగరం లేనోళ్లను పక్కనబెట్టుకుని పిచ్చోడిలా మాట్టాడాడు అని విమర్శించారు. వైఎస్ జగన్‌ని ఉద్దేశించి స్థాయి గురించి నోరుపారేసుకున్నాడు. అందుకే నేను ఈరోజు నీ స్థాయేంటని పవన్ కల్యాణ్‌ను ప్రశ్నిస్తున్నాను. రాష్ట్రంలో 5 కోట్లమంది తెలుగు ప్రజలను అడిగితే మనసున్న ముఖ్యమంత్రిగా జగన్ స్థాయి ఏమిటో చెబుతారు. ఒక ధీరుడు, ధీశాలి, ధైర్యవంతుడు, గొప్ప పాలకుడుగా సీఎం స్థాయి గురించి చెప్తారు అని మంత్రి జోగి రమేశ్ తెలిపారు.
ప్యాకేజీస్టార్ నీ స్థాయి ఇదే
పవన్ కల్యాణ్‌ది ఈ రాష్ట్రంలో ప్యాకేజీ స్థాయి అని మంత్రి జోగి రమేశ్ విమర్శించారు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెడితే నువ్వేమో యువరాజ్యం అధ్యక్షుడినన్నావు. అప్పట్లో ఏం చేశావు..? పార్టీని మడతపెట్టి కాంగ్రెస్‌లో కలిపేశారు అని విమర్శించారు. 2014లో జనసేన అనే పార్టీ పెట్టావు. మరి అప్పటి ఎన్నికల్లో నీ పార్టీ తరఫున ఒక్క సీట్లోనైనా పోటీచేయకుండా.. అరగేంట్రంలోనే పార్టీ మొత్తాన్ని చంద్రబాబుకు హోల్‌సేల్‌గా అమ్ముకున్న పాలేరుగాడివి అంటూ ఘాటు విమర్శలు చేశారు. 2019 ఎన్నికల్లో అప్పటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కూడగట్టాలని కమ్యూనిస్టులతో పొత్తుపెట్టి పోటీచేశావు. నువ్వు పోటీచేసిన రెండు చోట్లా ఓడిపోయావు. చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతూ.. ప్యాకేజీస్టార్‌గా పిలిపించుకుంటున్న నువ్వు ఈరోజు మా జగన్ గురించి మాట్లాడతావా..? అసలు, ఆయన పేరెత్తే అర్హత ఉందా నీకు..? చంద్రబాబు దత్తపుత్రుడనే గుర్తింపును నువ్వెన్నటికీ చెరిపేసుకోలేవని పవన్ కల్యాణ్ అని జోగి రమేశ్ మండిపడ్డారు.
తల్లిని అవమానించినోళ్లతో ఆలింగనమా..?
2014 ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌ను అవసరానికి వాడుకుని చంద్రబాబు, లోకేశ్‌లు తన్ని తరిమేస్తే.. 2019 ఎన్నికల్లో వాళ్లను కాదంటూ పోటీచేసిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని విమర్శించారు. నాడు చంద్రబాబు, లోకేశ్ పెద్ద అవినీతిపరులు.. ప్రజాధనాన్ని లూఠీ చేస్తున్న బడాచోర్‌లు అని అని పవన్ కల్యాణ్ విమర్శలు చేసింది వాస్తవం కాదా అని నిలదీశారు. తన తల్లిని సైతం అవమానించారని లోకేశ్‌కు వార్నింగ్‌లిచ్చిన వ్యక్తి ఇదే పవన్ కళ్యాణ్ కాదా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేశ్‌లు కలిసి అప్పట్లో పవన్ కల్యాణ్‌ను తీవ్రంగా విమర్శలు చేసిన విషయాన్ని మరచిపోయారా అని నిలదీశారు. జనసేన పార్టీకి ఒక సిద్ధాంతం లేదు. లక్ష్యం లేదు. కనీసం, ఒక తల్లికి పుట్టిన బిడ్డగా నీకైనా సిగ్గూశరం ఉండాలికదా పవన్ కల్యాణ్ అని మంత్రి జోగి రమేశ్ ప్రశ్నించారు. ప్యాకేజీ డబ్బుల కోసం మరీ ఇంతగా దిగజారిపోవాలా అని మంత్రి జోగి రమేశ్ నిలదీశారు. జనసేన పార్టీలో ఇన్నాళ్లూ పవన్ కల్యాణ్ అభిమానులుగా, పార్టీ సైనికుల్లా పనిచేసినోళ్లంతా చంద్రబాబు ములాఖత్ మిలాఖత్ ప్రకటనతో కళ్లు తెరుచుకున్నారు అని అన్నారు. తామంతా పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రి అవుతాడని ఒక పక్కన కష్టపడుతుంటే.. ఆయనేమో చంద్రబాబు చంకలో దూరి.. నా దత్తతండ్రి బాబే సీఎం అంటాడేంటని విస్మయం చెందుతున్నారు అని ధ్వజమెత్తారు. తామెప్పటికీ జెండాకూలీలుగానే మిగిలిపోవాల్సిందేనా అంటూ జనసైనికులు, మెగా అభిమానులు మథనపడుతున్నారు అని మంత్రి జోగి రమేశ్ చెప్పుకొచ్చారు.
వళ్లు దగ్గరబెట్టుకో.. తరిమికొడతారు
పిచ్చోడు చేతిలో రాయి ఎటు పడుతుందో.. ఎవరి తల పగులకొడుతుందో తెలియదంటారు కదా..? అలాంటి మానసిక రోగి, పిచ్చోడు ఈ పవన్ కల్యాణ్ అంటూ మంత్రి జోగి రమేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనను నమ్ముకున్నవాళ్లందర్నీ గంపగుత్తగా చంద్రబాబుకు అమ్ముకోవాలనే ప్రణాళిక ఇంకా ఎన్నాళ్లు నడుపుతాడు..? అని నిలదీశారు. పవన్ కల్యాణ్ కుట్రలు, కుతంత్రాలు కాపు సోదరులకు తెలిసిపోయిందని చెప్పుకొచ్చారు. ఇక వాళ్లంతా ఈ పిచ్చోడిని శాశ్వతంగా దూరం పెట్టేందుకు సిద్ధమైయ్యారు అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు దత్తపుత్రుడో.. వాళ్ల ఇంట్లో పెంపుడు కుక్కో.. లేదంటే, కట్టప్పలాంటి బానిసగా ఉంటాడో.. మాకు మాత్రం ఆయనతో అవసరం లేదని ఊరూరా పవన్ కల్యాణ్‌ను ఇన్నాళ్లూ అభిమానించిన ప్రజలు అనుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఇలాంటి నీచమైన స్థాయిలో ఉన్న పవన్ కల్యాణ్ విశేష ప్రజాదరణతో ఉన్న జగన్‌పై నోరుపారేసుకుంటే.. ప్రజలే రాళ్లతో తరిమితరిమి కొడతారని మంత్రి జోగి రమేశ్ హెచ్చరించారు.