- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు అరెస్ట్‌పై కేసీఆర్ స్పందించాలి : టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు
దిశ, డైనమిక్ బ్యూరో : ‘రాజకీయాలలో మానవత్వం ముఖ్యం... తప్పును తప్పని చెప్పలేనప్పుడు మనం రాజకీయాల్లో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే’ అని గన్నవరం టీడీపీ ఇన్చార్జి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసనగా గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు చేస్తున్న నిరసనకు యార్లగడ్డ వెంకట్రావు మద్దతు పలికారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై సీఎం కేసీఆర్ స్పందించాలి అని సూచించారు. చంద్రబాబు నాయుడు వల్లే హైదరాబాద్ డెవలప్ అయ్యిందని పలు సందర్భాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అన్నారని గుర్తు చేశారు. హైదరాబాద్ అన్ని రంగాల్లో డెవలప్ అయ్యిందంటే దాంట్లో చంద్రబాబు పాత్ర ఉంది అని చెప్పుకొచ్చారు. కాబట్టి చంద్రబాబు అరెస్ట్‌పై కేసీఆర్ స్పందించాలని కోరారు. మరోవైపు దేశంలో ప్రధాని అయ్యే అవకాశం వచ్చిన వదులుకొని తెలుగు ప్రజలకు సేవ చేద్దామని రాష్ట్రానికే పరిమితమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని యార్లగడ్డ వెంకట్రావు కొనియాడారు.