- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు, లోకేశ్ గురించి మాట్లాడితే తాట తీస్తాం: Kavali Greeshma
దిశ, ఏపీ బ్యూరో : పులిలా బయటికొచ్చే లోకేశ్ ఎక్కడ? పిల్లిలా తాడేపల్లిలో దాక్కొనే జగన్ ఎక్కడ? అని టీడీపీ అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. లోకేశ్ తెగింపు, ధైర్యం, మాటతీరు చూసి వైసీపీ నాయకులకు లాగులు తడుస్తున్నాయి. లోకేశ్‌కు లభిస్తున్న ఆదరణ చూసి వైసీపీకి వెన్నులో వణుకు పుట్టింది. వైసీపీ తుప్పును తొలగించడానికి వచ్చిన నిప్పు నారా లోకేశ్. నెల్లూరులో ఎవరైనా ఫోర్ ట్వంటీ ఉన్నాడంటే అది కాకాణి గోవర్థన్ రెడ్డే.. మరొకరు కాదు. ప్రశాంతంగా వున్న నెల్లూరును కాకాణి సర్వ నాశనం చేశారు. చంద్రబాబు, లోకేశ్‌ల గురించి పిచ్చివాగుడు వాగితే తాట తీస్తాం.
వైసీపీ నాయకులు ఎదుటివారి గురించి హేళనగా మాట్లాడం మానాలి. వైసీపీకి చుక్కలు చూపించడం ఆరంభమైంది అని గ్రీష్మ చెప్పుకొచ్చారు. వైసీపీ నాయకులు తమ తప్పు తెలుసుకొని నష్టం జరిగిన వారిని పరామర్శించాల్సిన అవసరముంది. పోలీసుల ప్రొటెక్షన్ లేకుండా జగన్ రోడ్డుపైకి రాగలడా? ఆపదలో ఉన్న ప్రజల కోసం లోకేశ్ దర్జాగా బయటికి వచ్చి వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటాడు.. అది లోకేశ్ గొప్పతనం. వారి కోసం ఫైట్ చేస్తున్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నోటికేది వస్తే అది మాట్లాడితే ఊరుకునేదిలేదు. పిచ్చి ప్రేలాపనలు పేలిస్తే ఒక్కొక్కరి తాట తీస్తాం. కాకాణి గోవర్థన్ రెడ్డి నోటికి అద్దూ అదుపు లేకుండా పోయాయి. కాకాణి గోవర్థన్ రెడ్డి మంత్రి అయ్యాక అనేక మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగాయి. వాటి గురించి ఏనాడూ నోరెత్తలేదు. అమ్మాయిపై యాసిడ్ పోసి గొంతు కోశారు. దళితులపై దౌర్జన్యాలు చేస్తున్నారు. లాకప్ డెత్‌లు కూడా జరుగుతున్నాయి. ఆడపిల్లలు రోడ్డుపైకి రావాలంటేనే భయపడుతున్నారు. మాజీ మంత్రి అనిల్ కాకాణిపై కేసు వేసిన విషయం మరచిపోయినట్లున్నారు. చంద్రబాబు, లోకేశ్‌ల గురించి ఇంకోసారి మాట్లాడితే ఊరుకునేదిలేదు ఖబడ్దార్.. అని టీడీపీ అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ హెచ్చరించారు.
Also Read :అమరావతి రైతుల మహా పాదయాత్ర కు గ్రీన్ సిగ్నల్
- Tags
- Kavali Greeshma