Pawan Kalyan:కర్ణాటక సహకారం అభినందనీయం..డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హర్షం!

by Jakkula Mamatha |
Pawan Kalyan:కర్ణాటక సహకారం అభినందనీయం..డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హర్షం!
X

దిశ, డైనమిక్‌ బ్యూరో:అటవీ సంపదను సంరక్షించేందుకు సమష్టిగా చర్యలు చేపడతామని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అన్నారు. గురువారం బెంగళూరులో కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్‌ బి. ఖండ్రే, కర్ణాటక అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కర్ణాటక - ఆంధ్రప్రదేశ్‌ మధ్య ఎల్లప్పుడూ సుహృద్భావ వాతావరణం ఉంటుందని అన్నారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు వైపు ఏనుగుల సమస్య అధికంగా ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కర్ణాటక ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్‌‌కు తగిన విధంగా సహకారం అందించడం సంతోషం కలిగించిందని పవన్‌ తెలిపారు.

ముఖ్యంగా 8 కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్‌‌కు అందించేందుకు కర్ణాటక ప్రభుత్వం ఒప్పుకోవడం మంచి పరిణామం అని అన్నారు. ఎర్ర చందనం అక్రమ రవాణాపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన విధంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. అటవీ సంపద రక్షణ కోసం సాంకేతికతను ఉపయోగించుకోవాలని సూచించారు. వన్యప్రాణులను చంపి స్మగ్లింగ్‌ చేసే వారిని కట్టడి చేసేలా రెండు రాష్ట్రాలు సమష్టిగా ముందుకు వెళ్లాలని నిర్ణయించాయి. తిరుమల, శ్రీశైలం దేవస్థానాలకు కర్ణాటక నుంచి భక్తులు ఎక్కువగా వస్తుంటారు. వీరికి అవసరమైన యాత్రి సదన్‌ నిర్మాణాల నిమిత్తం కర్ణాటక ప్రభుత్వం రెండు చోట్ల తగిన విధంగా భూములు కేటాయించాలని కోరగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళతానని పవన్‌ తెలిపారు.

Advertisement

Next Story