- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ పార్టీలోకి వెళ్లను.. క్లారిటీ ఇచ్చిన కందుకూరు ఎమ్మెల్యే
దిశ, వెబ్ డెస్క్: కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల రామారావు యాదవ్‌ను అధిష్టానం ఖరారు చేసింది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. బొట్ల రామారావు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే మరి మహీధర్ రెడ్డి పరిస్థితేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో మహీధర్ రెడ్డి పోటీపై రకరకాల ప్రచారాలు జరుతున్నాయి. త్వరలో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారని, త్వరలో టీడీపీ తీర్థం పుచ్చుకోబుతున్నారని ప్రచారం జరుగుతోంది.
దీంతో మహీధర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరే ప్రసక్తే లేదని చెప్పారు. ఆ పార్టీలోకి తాను వెళ్తున్నట్టు జరుగుతుందని వట్టి ప్రచారమేనని, అది వాస్తవం కాదని స్పష్టం చేశారు. అలాగే ఎవరినీ తాను కలవాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. సీఎం జగన్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. టికెట్ వస్తే పోటీ చేస్తానని.. రాకపోతే ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతానని పేర్కొన్నారు. కందుకూరు నియోజకవర్గంలో బీసీలకు టికెట్ ఇస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఇక ఫైనల్ నిర్ణయం సీఎం జగన్‌దేనని మహీధర్ రెడ్డి తెలిపారు.