కేబుల్ ఆపరేటర్ నిర్లక్ష్యం.. కడప ఘటనలో షాకింగ్ నిజాలు

by srinivas |
కేబుల్ ఆపరేటర్ నిర్లక్ష్యం.. కడప ఘటనలో షాకింగ్ నిజాలు
X

దిశ, వెబ్ డెస్క్: కేబుల్ ఆపరేటర్ నిర్లక్ష్యం వల్లే బాలుడు తన్విరుల్లా మృతి చెందారని కడప ఎస్సీ అన్నారు. కడప బెల్లంమండిలో సైకిల్‌కు కరెంట్ తీగలు తగిలి విద్యార్థి తన్విరుల్లా మృతి చెందారు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన ఎస్సీ... డిష్ కేబుల్ ఆపరేటర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. కేబుల్ వైర్‌కు ఉన్న జీఏ వైర్ సైకిల్‌ టైర్‌కు చుట్టుకుని ఆ తర్వాత ట్రాన్స్‌ఫార్మర్‌కు ఆ వైర్ తగలడం వల్ల విద్యార్థి మృతి చెందారని తెలిపారు. సైకిల్ ఇసుముకావడంతో బాలుడికి కరెంట్ షాక్ తగిలిందన్నారు. కరెంట్ ఆపకుండా స్తంభాలపై కేబుల్ వైర్లు తగిలిస్తున్నారని తెలిపారు. కరెంట్ స్తంభాలకు కేబుల్ ఆపరేటర్లు ఇష్టానుసారంగా వైర్లు వేలాడిదీస్తున్నారని ఎస్సీ మండిపడ్డారు. తమకు సమాచారం ఇవ్వకుండా, అనుమతి తీసుకోకుండా కేబుల్ వైర్లు పెట్టిన ఆపరేటర్లకు నోటీసులు ఇస్తామని ఎస్సీ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed