KA Paul: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు.. కే‌ఎల్ పాల్ సంచలన వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-10-30 06:29:23.0  )
KA Paul: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు.. కే‌ఎల్ పాల్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం చరమాంకానికి చేరకుంది. డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ (Kamala Harris), రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. నిత్యం వరుస డిబేట్లతో యూస్ ఎలక్షన్స్ (US Election) మాటాల యుద్ధాన్ని తలపిస్తున్నాయి. ఈ మేరకు నవంబర్ 5 పోలింగ్ జరగనుంది. అదే రోజున కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. తుది ఫలితాలు వెల్లడయ్యేందుకు కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. ఆయా సర్వే సంస్థలు (Survey Organizations) తెలిపిన సమాచారం మేరకు.. ఇద్దరు అభ్యర్థుల మధ్య స్వల్ప తేడానే ఉన్నట్లుగా సమాచారం.

ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఫిలడెల్ఫియా (Philadelphia)లో మాట్లాడుతూ.. భారత్‌లో ఈవీఎం (EVM)ల ట్యాంపరింగ్ (Tampering) జరిగినట్లుగా అమెరికా (America)లో రిగ్గింగ్ జరగకూడదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేపిటల్ బిల్డింగ్‌ (Capital Building)పై దాడి ఘటన పునరావృత్తం కాకూడదు ఆకాంక్షిచారు. పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు (US Presidential Election) సజావుగా జరిగేలా చూడాలని అక్కడి ప్రజలకు కేఏ పాల్ పిలునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed