పవన్ సీఎం అయ్యేందుకు ప్లాన్ రూపోందించిన కేఎ పాల్

by Mahesh |   ( Updated:2024-01-10 06:15:39.0  )
పవన్ సీఎం అయ్యేందుకు ప్లాన్ రూపోందించిన కేఎ పాల్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను సీఎం చేసేందుకు ప్లాన్ రూపొందించినట్లు తెలిపారు. నిన్న సీఈసీ మీటింగ్ అనంతరం పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు పాల్ జనసేన కార్యాలయానికి వెళ్లాడు. అక్కడే అరగంట పాటు ఉండి పవన్ ను కలిసేందుకు అనుమతి రాకపోవడంతో అక్కడి నుంచి వెళుతూ కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు. తన వద్ద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. తమ్ముడు పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేందుకు ప్లాన్ నా దగ్గర ఉంది. అది పవన్ ని కలిసి ఆయనకు చెప్పడానికి ఇక్కడకు వచ్చాను అని చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed