- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దొంగ కేసుల నుంచి న్యాయం, చట్టాలే మమ్మల్ని కాపాడుతాయి: నారా లోకేశ్
దిశ , డైనమిక్ బ్యూరో : వైసీపీ ప్రభుత్వం దొంగ కేసులు బనాయించి తమను జైల్లో పెట్టాలని కుట్రలు చేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఢిల్లీలో టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడ రవీంద్రకుమార్ నివాసంలో సత్యమేవ జయతే నిరసన దీక్ష చేపట్టారు. ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కుటుంబ సభ్యులు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. నిరసన దీక్ష ముగింపు సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడారు. దొంగ కేసులనుంచి న్యాయం, చట్టాలే తమను కాపాడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ, నెల్సన్ మండేలా నమ్మిన సిద్ధాంతం కోసం జైలుకెళ్లారు. చంద్రబాబు నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కోసం స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు తెచ్చినందుకే దొంగ కేసులు పెట్టి జైలుకు పంపారు అని లోకేశ్ అన్నారు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు పెద్దఎత్తున ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు తీసుకువచ్చారన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 2.15 మందికి శిక్షణ ఇచ్చి 80వేలమందికి ఉద్యోగాలు కల్పించారు అని లోకేశ్ గుర్తు చేశారు. జవాబుదారి తనంతో పనిచేయాలని...ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని చంద్రబాబు తమకు పదేపదే హితబోధ చేసేవారని లోకేశ్ గుర్తు చేశారు. చంద్రబాబు యుద్ధప్రాతిపదికను పనులు చేయడం వల్లే పెద్దఎత్తున నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చాయి అని లోకేశ్ వెల్లడించారు.
గంటకొడితే కేసులేంటి?
టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు 45ఏళ్లు అహర్నిశలు పనిచేసి సైబరాబాద్‌తోపాటు రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలను అభివృద్ధి చేశారు అని తెలిపారు. ఏ తప్పు చేయని చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో తప్పుడు కేసుపెట్టి 24 రోజులుగా చంద్రబాబును జైల్లో నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 45ఏళ్లుగా తెలుగు ప్రజల కోసం, రాష్ట్రం కోసం పనిచేసినందుకే చంద్రబాబు నాయుడుపై తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా గత 24రోజులుగా ప్రజలు శాంతియుతంగా ప్రజలు నిరసన తెలియజేస్తున్నారని వారందరికీ లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మోత మోగిద్దాం కార్యక్రమంలో పెద్దఎత్తున సామాన్యులు రోడ్డుపైకి వచ్చి నిరసనలు తెలిపారని వారికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. నిరసన తెలిపేందుకు విజిల్ వేసి, గంటకొడితే ఈ పోలీసులు కేసు పెట్టారని మండిపడ్డారు. ఈ పిచ్చి జగన్ ఇంతకంటే గొప్ప పని ఇంకేమీ చేయలేరని చెప్పుకొచ్చారు. భువనేశ్వరి పొలిటికల్ యాక్షన్ కమిటీలో అక్టోబర్ 2న నిరాహారదీక్ష చేస్తామని వెల్లడించారని.. ఆమెకు సంఘీభావంగా తాము కూడా దీక్షచేపట్టామని తెలిపారు. దీక్షలో పాల్గొన్న వారందరికీ లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు.
ఆధారాలను జడ్జి ముందు పెట్టాలి
స్కిల్ స్కాం కేసులో ఈ ప్రభుత్వం వద్ద ఆధారాలు ఉంటే జడ్జి ముందు పెట్టాలి అని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ఆధారాలు లేని స్కిల్ డెవలప్మెంట్‌లో చంద్రబాబును జైలుకు పంపడమేగాక మరో 3కేసులు సిద్ధం చేశారని మండిపడ్డారు. వైసీపీ మంత్రులు రోజుకోసారి తనను, భువనేశ్వరి, బ్రాహ్మణిని జైలుకు పంపుతామని పదేపదే హెచ్చరిస్తున్నారని ఇది ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపు కాదా అని లోకేశ్ ప్రశ్నించారు. అయినా తాము వెనక్కి తగ్గేదేలేదని మరింత గట్టిగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. తమపై పెట్టిన తప్పుడు కేసులను ఆధారాలతో సహా అన్నీ ప్రజల ముందు ఉంచుతామని లోకేశ్ తెలిపారు. అక్టోబర్ 3న సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ విచారణకు వస్తుందని...కోర్టు నిర్ణయాన్ని బట్టి తమ భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు.