- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మనుషుల మాదిరిగానే పాముకు పాడె కట్టి, ఊరేగించి దహనసంస్కారాలు!
దిశ, డైనమిక్ బ్యూరో: చనిపోయిన పాముకు పాడె కట్టి ఊరంతా ఊరేగించి దహన సంస్కారాలు నిర్వహించిన వింత ఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్ పంచాయతీ పరిధిలోని మేళంవారిమెరకలో మంగళవారం ఇళ్ల పరిసరాల్లో తాచు పాము కనిపించింది. ఆ పాము అప్పటికే కదలలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుంది. చివరి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ.. ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లింది. పాము పడిపోయిన చోటు నుండి ఎంతకీ కదలకపోవడంతో స్థానికులు చనిపోయినట్లు గుర్తించారు.
ఆ పరిసర ప్రాంత ప్రజలు తాచుపామును దేవునిగా భావించి మనుషుల మాదిరిగానే దహన సంస్కారాలు చేపట్టారు. పాముకు స్నానం చేయించి, కొబ్బరి చెట్టు కొమ్మతో పాడె కట్టి పామును పడుకోబెట్టారు. అనంతరం పసుపు కుంకుమ వేసి పూజలు చేశారు. చనిపోయిన పామును పాడెపై ఊరంతా ఊరెగించి దహన సంస్కారాలు నిర్వహించారు. దీనికి సంబందించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ బిన్నంగా స్పందిస్తున్నారు.