- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారు: నారా రోహిత్
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం నిరంతరం ఒక కార్యకర్తగా పనిచేస్తానని హీరో నారా రోహిత్ వెల్లడించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పోటీకి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి వస్తారని చెప్పుకొచ్చారు. టీడీపీ కార్యక్రమాల్లో యాక్టివ్ అవుతారంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఒనుకువారిపల్లి విడిది కేంద్రం వద్ద శనివారం ఉదయం నారా లోకేశ్‌ను రోహిత్ కలిశారు. యువగళం పాదయాత్రకు తన సంఘీభావం ప్రకటించారు. పార్టీ కార్యకర్తలు, నేతలతో కలిసి అన్న లోకేశ్‌తో సెల్ఫీ దిగారు. ఆ తర్వాత లోకేశ్‌తో కలిసి పాదయాత్రలో నడిచారు.
ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అన్న నారా లోకేశ్ చేస్తున్న యువగళం పాదయాత్రకు అపూర్వ స్పందన వస్తోంది అని హీరో నారా రోహిత్ అన్నారు. యువగళం పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేకనే వైసీపీ నేతలు లోకేశ్‍పై విమర్శలు చేస్తున్నారు అని ఆరోపించారు. ప్రజలంతా టీడీపీ కోసం ఎదురుచూస్తున్నారు అని స్పష్టం చేశారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు అన్నీ అందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయని హీరో నారా రోహిత్ చెప్పుకొచ్చారు.