MLA Krishna Prasad : జోగి రమేష్ గొంగళిపురుగు లాంటోడు : ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-07 12:04:39.0  )
MLA Krishna Prasad : జోగి రమేష్ గొంగళిపురుగు లాంటోడు : ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్
X

దిశ, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి జోగి రమేష్(Jogi Ramesh) అనేటోడు గొంగళి పురుగు వంటి వాడని, గతంలో మంత్రిగా ఉన్నప్పుడు మైలవరానికి చేసిందేమి లేదని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్( MLA Vasantha Venkata Krishna Prasad) విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలతో ఓడామన్న జోగి రమేశ్ వచ్చే ఎన్నికల్లో కూడా వాటితోనే ఎన్నికలు జరుగుతాయని మరి అప్పుడు ఓడితే కూడా అదే మాటలు చెబుతాడా అని ఎద్దేవా చేశారు. జోగి రమేశ్ అవినీతి, అక్రమ ఆస్తుల సంగతి చాల ఉందని, 2019ఎన్నికల నాటికి ఇప్పటికి ఉమ్మడి కృష్ణా జిల్లాలో అధిక ఆస్తి పరుడు ఎట్లా అయ్యాడన్నారు. హైదరాబాద్ అవుటర్, రీజనల్ రింగ్ రోడ్ల వెంట భూములు కొనడానికి జోగికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. అసలు జోగి రమేష్ కొడుకు మీద కాకుండా అగ్రీ భూముల కేసును రమేష్ పైనే పెట్టాలన్నారు. ప్రభుత్వ పరిశ్రమల విభాగం నుంచి జోగి బాబాయికి, నాకు ఒకే రకంగా బకాయిలు వచ్చాయని ఇందులో సమస్య ఏముందన్నారు. అయినా సొంత బాబాయ్ వద్ధ పరిశ్రమ అనుమతుల కోసం మంత్రిగా గతంలో కమిషన్లు దండుకున్న అవినీతి పరుడు జోగి రమేష్ అని విమర్శించారు. పెడన ప్రజలను అడిగితే జోగి రమేష్ పనితీరు ఏమిటో చెబుతారన్నారు.

డీటీపీఎస్ బూడిదను, ఇసుకను అమ్ముకున్న అవినీతి పరుడన్నారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ సీటు త్యాగం చేశాడని చెప్పుకున్నాడని, ఆయన సీటు త్యాగం చేశాడా, అమ్ముకున్నాడా అని ఎద్దేవా చేశారు. 2019లో నీ కోసం పెడనలో సీటు త్యాగం చేసిన నాయకుడికి నీవు ఏం చేశావని, మరి 2024ఎన్నికల్లో పెడనలో సీటు ఇవ్వకుండా పెనమనూరులో నిలబెడితే జిల్లాలోనే భారీ మెజార్టీతో ఎందుకు ఓడిపోయావని, నేను మైలవరంలో జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిచానన్నారు. నేను పార్టీ మారి పక్కన పార్టీలో చేరానని నన్ను విమర్శిస్తున్న జోగి రమేష్ 2009లో జగన్ ను ఉద్దేశించి అలాంటి కొడుకును ఎలా కన్నారని వైఎస్ కుటుంబంపై విమర్శలు చేశాడని, మంత్రి పదవి ఇవ్వనప్పుడు జగన్ పై చేసిన విమర్శల సంగతి అందరు మరిచిపోలేదన్నారు. జనసేన పార్టీలో చేరేందుకు జోగి చేసిన ప్రయత్నాలు మా అందరికి తెలుసని, సొంత కులస్తుల నుంచి ఉద్యోగాల పేరుతో లక్షలు వసూలు చేసుకున్న అవినీతి పరుడని విమర్శించారు. వరదల సమయంలో కనిపించని వ్యక్తి ఇప్పుడొచ్చి ఏదో తడఖా చూపుతాడంటున్నాడని ఎద్దేవా చేశారు. జోగు రమేష్ శాసన సభలలో భవిష్యత్తులో అడుగుపెట్టడని, మైలావరం నుంచి అసలు సాధ్యం కాదని కృష్ణ ప్రసాద్ విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed