ఎమ్మార్వో రమణయ్య కుటుంబానికి ఉద్యోగం, ఆర్థిక సాయం

by srinivas |
ఎమ్మార్వో రమణయ్య కుటుంబానికి ఉద్యోగం, ఆర్థిక సాయం
X

దిశ, వెబ్ డెస్క్: రెండు రోజుల క్రితం విశాఖలో ఎమ్మారో రమణయ్య హత్యకు గురైన విషయం తెలిసింది. అయితే ఆయన కుటుంబానికి ప్రభుత్వం రూ. 50 లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు ఒకరి ఉద్యోగం కూడా ప్రకటించింది. కాగా ఎమ్మార్వో రమణయ్య రియల్టర్ చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. భూ లావాదేవీల వ్యవహారం ఎమ్వార్వో రమణయ్య తలపై రియల్టర్ గంగారామ్ రాడ్డుతో కొట్టి పారిపోయారు. బెంగళూరు, చెన్నైలలో గాలించిన పోలీసులు.. చివరకు ఎగ్మోర్‌లో నిందితుడు గంగారమ్‌ను అరెస్ట్ చేశారు. అయితే ఎమ్మార్వో రమణమ్మ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed