JC Prabhakar Reddy: చంద్రబాబు సీఎం అయ్యాకే.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2022-04-19 12:27:39.0  )
JC Prabhakar Reddy: చంద్రబాబు సీఎం అయ్యాకే.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, ఏపీ బ్యూరో: కళ్యాణదుర్గంలో చిన్నారి మృతిపై న్యాయవిచారణ జరిపించాలంటూ నిరసనలు తెలుపుతున్న ప్రకాష్ నాయుడుపై పోలీలు రౌడీషీట్ ఓపెన్ చేయడం పట్ల టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే తమపై రౌడీషీట్ ఓపెన్ చేయడం దారుణమన్నారు. ఇలాంటి తప్పుడు కేసులు ఎన్ని బనాయించినా భయపడేది లేదని స్పష్టం చేశారు. కార్యకర్తల కోసం ఎంతదూరమైనా వెళ్తానని చెప్పారు. చంద్రబాబు సీఎం అయ్యాకే రాజకీయ సన్యాసం తీసుకుంటానని జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

Advertisement

Next Story